‘ఒకరోజు మహాభారతం చదువుతుంటే అందులో ఉన్న చాలా శాపాల గురించి తెలిసింది. అటువంటి శాపాన్ని ఇప్పటి జనరేషన్ కుర్రాడు ఎదుర్కొంటే ఎలా ఉంటుందన్న కాన్సె్‌ప్టతో ‘హ్యాపీ ఎండింగ్’ కథ మొదలైంది’ అన్నారు దర్శకుడు కౌశిక్ భీమిడి. యశ్ పూరి హీరోగా నటించిన ఈ చిత్రం ఫిబ్రవరి 2న విడుదల కానుంది. యోగేశ్ కుమార్, సంజయ్‌రెడ్డి, అనిల్ పల్లాల నిర్మాతలు. విడుదల సందర్భంగా దర్శకుడు మీడియాతో ముచ్చటిస్తూ ‘పురాణాల నుంచి తీసుకున్న అంశం కనుక ట్రీట్‌మెంట్ మోడరన్‌గా ఉండాలనుకున్నా. ‘వికీ డోనర్’ వంటి చిత్రాలు ఐడియా పరంగా అడల్ట్ ఓరియంటెడ్‌గా ఉన్నా, మా మూవీ ట్రీట్‌మెంట్ మాత్రం అందరూ చూసేలా కన్విన్సింగ్‌గా ఉంటుంది.’ అని కౌశిక్ చెప్పారు. ‘హ్యాపీ ఎండింగ్’ స్ర్కిప్ట్‌కు యశ్, అపూర్వ చక్కగా సూట్ అయ్యారు. వాళ్ల నటన కూడా ఫ్రెష్‌గా ఉంటుంది. దర్శకుడిగా నాకు ఇది తొలి సినిమా కనుక టెక్నీషియన్లు కూడా కొత్త వాళ్లు ఉంటే నాకు కంఫర్ట్‌గా ఉంటుందనుకున్నాను. మంచి టీమ్ సెట్ అయింది. సినిమా బిగినింగ్‌లోనే హీరోకు ఉన్న శాపం గురించి రివీల్ చేస్తాం. పతాక సన్నివేశాల్లో శాపవిముక్తితో హ్యాపీగా కథ ముగున్తుంది. అసలు అతనికి శాపం ఉందా లేదా అన్నది చిన్న రీకాలింగ్ సీన్స్‌తో సైకలాజికల్ డ్రైవ్‌తో చూపించాం. ఇది మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ కనుక థియేటర్లలోనే చూడాలని నా మనవి’ అన్నారాయన.