బాలీవుడ్ నటుడు వరుణ్ ధావన్ ప్రస్తుతం ఎ. కాళీశ్వరన్ దర్శకత్వంలో తన రాబోయే చిత్రం (VD18) చిత్రీకరణలో బిజీగా ఉన్నాడు. తమిళ బ్లాక్బస్టర్ థెరి యొక్క హిందీ రీమేక్ లో కీర్తి సురేష్ మరియు వామికా గబ్బి మహిళా ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. తాజా అప్డేట్ ప్రకారం, ఈ చిత్రానికి బేబీ జాన్ అనే టైటిల్ ని ఖరారు చేసినట్లు సమాచారం. అయితే నిర్మాతల నుండి అధికారిక ప్రకటన రావలిసి ఉంది. అట్లీ మరియు జియో స్టూడియోస్ సమర్పకులుగా ఎ ఫర్ యాపిల్ మరియు సినీ 1 స్టూడియోస్ బ్యానర్లపై ప్రియా అట్లీ, మురాద్ ఖేతాని మరియు జ్యోతి దేశ్పాండే నిర్మిస్తున్న ఈ భారీ అంచనాల ప్రాజెక్టుకు థమన్ సంగీతం అందిస్తున్నారు.