కోలీవుడ్ నటుడు ధనుష్ ఒక స్ట్రెయిట్ తెలుగు చిత్రం చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి తాత్కాలికంగా D 51 అనే పేరును పెట్టారు. తాజాగా ఇప్పుడు ప్రతిభావంతులైన బాలీవుడ్ నటుడు జిమ్ సర్భ్ ఈ సినిమాలో భాగం అయ్యినట్లు మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. పద్మావత్, మిసెస్ ఛటర్జీ వర్సెస్ నార్వే, మరియు మేడ్ ఇన్ హెవెన్ సిరీస్‌లలో అత్యద్భుతమైన నటనకు పేరుగాంచిన సర్భ్‌కు తెలుగు చిత్ర పరిశ్రమకు ఘన స్వాగతం లభించింది.
ఈ ప్రాజెక్ట్‌లో రష్మిక మందన్న మహిళా ప్రధాన పాత్రను పోషించనుంది.అక్కినేని నాగార్జున ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. నికేత్ బొమ్మి ఈ సినిమాకి సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు. అమిగోస్ క్రియేషన్స్ సహకారంతో శ్రీవెంకటేశ్వర సినిమాస్ LLP, సోనాలి నారంగ్ సమర్పణలో ఈ ప్రాజెక్ట్ ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నారు.