కొరటాల శివ డైరెక్షన్ లో టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఒక చిత్రాన్ని ప్రకటించిన విషయం అందరికి తెలిసిందే. ఈ పాన్-ఇండియన్ చిత్రానికి 'దేవర' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. తాజా అప్డేట్ ప్రకారం, ఈ సినిమా ఓవర్సీస్ రైట్స్ ని ప్రధానంగా తమిళ సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేసే హంసిని ఎంటర్టైన్మెంట్స్ 27 కోట్లకు కొనుగోలు చేసిందని వార్తలు వినిపిస్తున్నాయి. అంటే బ్రేక్ఈవెన్ మార్క్‌ని సాధించాలంటే దేవరా 6.5 మిలియన్ల కంటే ఎక్కువ గ్రాస్‌ను సాధించాలి. ఒక్క USAలోనే దేవారా సేఫ్ జోన్లో ఉండటానికి 5 మిలియన్లకు పైగా వసూలు చేయాలి.
ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ జోడిగా నటిస్తుంది. ఈ చిత్రం ఏప్రిల్ 5, 2024న విడుదల కానుంది. ఈ సినిమాలో సైఫ్ అలీ ఖాన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. సౌత్ ఇండియన్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ ఈ సినిమాకి మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నారు. కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌తో కలిసి యువసుధ ఆర్ట్స్ బ్యానర్ ఎ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.