పుష్కరకాలం క్రితం తెలుగు తెరకు పరిచయమైన బాలీవుడ్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ తన ప్రేమికుడు నిర్మాత జాకీ భగ్నానీని త్వరలో పెళ్లి చేసుకోబోతున్న విషయం తెలిసిందే. ఫిభ్రవరి చివరి వారాంతంలో వీదేశాల్లో డెస్టినేషన్ వెడ్డింగ్ తో వీరు ఒకటికానున్నారు. ఈమేరకు ఇప్పటికే ఏర్పాట్లు కూడా మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. అయితే తాజాగా ఈ విషయంలో మార్పులు జరిగాయని వీదేశాల్లో కాకుండా స్వదేశంలోనే పెళ్లి చేసుకోబోతున్నారంటు సోషల్మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. కొద్దిరోజుల క్రితం ప్రధాని మోధీ లక్ష్యద్వీప్ పర్యటనకు వెళ్లినప్పుడు ఆయన పర్యాటకులు, డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోవాలనుకునే వారు వేరే దేశాలకు వెళ్లకుండా మన దేశంలోనే మంచి పర్యాటక ప్రదేశాలను సెలక్ట్ చేసుకోవాలని పిలుపునిచ్చారు. దీంతో దేశవ్యాప్తంగా మంచి స్పందన వస్తోంది. ఈ క్రమంలోనే రకుల్ జంట కూడా తమ వీదేశాలలో కాకుంండా మన దేశంలోనే గోవాలో వివాహం చేసుకోవాలనే నిర్ణయానికి వచ్చినట్టు వారి కుటుంబ సభ్యులు ఓ మీడియాకు తెలిపినట్టు సమాచారం.