నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బాబీ కొల్లి దర్శకత్వంలో తన తదుపరి సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఈ చిత్రానికి తాత్కాలికంగా ఎన్బికె 109 అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. తాజాగా ఇప్పుడు ఈ సినిమాలో బాలకృష్ణకి జోడిగా శ్రాధ శ్రీనాధ్ కనిపించనున్నట్లు ఫిలిం సర్కిల్ లో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయాన్ని త్వరలో మూవీ మేకర్స్ అధికారకంగా ప్రకటించనున్నారు.
ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు బాబీ డియోల్, ఊర్వశి రౌటేలా కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ యాక్షన్-ప్యాక్డ్ సినిమాని సితార ఎంటర్టైన్మెంట్స్పై నాగ వంశీ మరియు ఫార్చూన్ ఫోర్ సినిమా సాయి సౌజన్య నిర్మించారు. ఈ సినిమాకి సెన్సషనల్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ సంగీత అందిస్తున్నారు.