నిర్మాత మరియు నటుడు జాకీ భగ్నానితో చాలా కాలం పాటు ప్రేమలో ఉన్న స్టార్ నటి రకుల్ ప్రీత్ సింగ్ ఎట్టకేలకు ఫిబ్రవరి 21న పెళ్లి చేసుకోనున్నారు. నటి చెప్పిన తేదీన గోవాలో డెస్టినేషన్ వెడ్డింగ్ జరగనుంది. అయితే బాలీవుడ్ మీడియాలో తాజా అప్డేట్ ప్రకారం పెళ్లి వేడుక వేదికలో మార్పు ఉంది అని సమాచారం.
పెళ్లి వేడుకను మిడిల్ ఈస్ట్‌లో నిర్వహించాలనేది అసలు ప్లాన్. నెలల తరబడి ప్లాన్ చేసుకున్న కపుల్ ఈ వేడుకకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. అయితే, ప్రధాని నరేంద్ర మోదీ పిలుపును గౌరవిస్తూ చివరి నిమిషంలో వేదికను భారత్‌కు తరలించాలని నిర్ణయించుకున్నారు.