టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ సినిమాటోగ్రాఫర్ నుండి దర్శకుడిగా మారిన కార్తీక్ ఘట్టమ్నేనితో తన తదుపరి ప్రాజెక్ట్ ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ యాక్షన్ థ్రిల్లర్ కి 'ఈగిల్' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా నుండి 4వ సింగిల్ ని గరుడమ్ అనే టైటిల్ తో పూర్తి పాటను రేపు రాత్రి 8:01 గంటలకు విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు చిత్ర బృందం సరికొత్త పోస్టర్ ని విడుదల చేసింది.
ఈ సినిమా ఫిబ్రవరి 9, 2024న తెలుగు మరియు హిందీలో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కానుంది. థ్రిల్లర్ ట్రాక్ లో రానున్న ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటిస్తుంది. ఈ సినిమాలో కావ్య థాపర్, నవదీప్, శ్రీనివాస్ అవసరాల, మధుబాల తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ ప్రాజెక్ట్‌ని నిర్మిస్తుంది.