రాహుల్ సదాశివన్ రచన మరియు దర్శకత్వంలో మాలీవుడ్ మెగాస్టార్ మమ్ముట్టి తన కొత్త చిత్రాన్ని అధికారకంగా ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి మూవీ మేకర్స్ 'బ్రహ్మయుగం' అనే టైటిల్ ని ఖరారు చేసారు. ఈ పాన్-ఇండియన్ చిత్రం హారర్-థ్రిల్లర్ జానర్లో రానున్నట్లు సమాచారం.
తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా కేవలం బ్లాక్ అండ్ వైట్ ఫార్మాట్లో మాత్రమే విడుదల కానుంది అని ప్రకటించారు. ఈ విషయాన్ని చిత్ర బృందం సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసి ప్రకటించారు. మూవీ మేకర్స్ నుండి వచ్చిన ఈ ఆసక్తికరమైన చర్య సినీ ప్రియుల ఆసక్తిని రేకెత్తించింది.
ఈ చిత్రం ఫిబ్రవరి 16, 2024న విడుదల కానుంది. ఈ చిత్రాన్ని నైట్ షిఫ్ట్ స్టూడియోస్ ఎల్ ఎల్ పి, వై నాట్ స్టూడియోస్ బ్యానర్లపై చక్రవర్తి రామచంద్ర, శశికాంత్ నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడికానున్నాయి.