ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'OG' పై వస్తున్న పుకార్లను కొట్టిపారేసిన TG విశ్వ ప్రసాద్

cinema |  Suryaa Desk  | Published : Tue, Feb 06, 2024, 06:02 PM

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన తదుపరి సినిమాని యంగ్ డైరెక్టర్ సుజీత్‌ దర్శకతంలో చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ యాక్షన్-అడ్వెంచర్ చిత్రానికి తాత్కాలికంగా OG అనే టైటిల్ ని మూవీ మేకర్స్ పెట్టారు. అనౌన్స్‌మెంట్‌తోనే ఈ సినిమా సంచలనం సృష్టించింది.

తాజాగా ఒక రూమర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ DVV ఎంటర్‌టైన్‌మెంట్ నుండి OGని టేకోవర్ చేసిందని పుకారు వినిపిస్తున్నాయి. ఇప్పటికే డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ వారు ఈ చిత్రాన్ని నిర్మిస్తామని స్పష్టం చేశారు.

ఇప్పుడు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టీజీ విశ్వ ప్రసాద్ నిరాధారమైన పుకార్లను కొట్టిపారేశారు. పవన్ నటించిన సినిమాని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ తమ ఆధీనంలోకి తీసుకుందనడంలో వాస్తవం లేదన్నారు. అలాంటిదేమీ జరగలేదని ఆయన అన్నారు.

ఈ సినిమా సెప్టెంబర్ 27, 2024న థియేటర్స్ లో విడుదల కానుంది. ఈ పాన్-ఇండియన్ ప్రాజెక్ట్‌లో ప్రియాంక అరుల్ మోహన్ మహిళా ప్రధాన పాత్రలో నటిస్తుంది. ఈ బిగ్గీకి థమన్ సంగీతాన్ని అందిస్తున్నారు.


ఈ చిత్రంలో ఇమ్రాన్ హష్మీ, ప్రకాష్ రాజ్, అర్జున్ దాస్, శ్రీయా రెడ్డి, హరీష్ ఉత్తమన్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాని డివివి ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com