ఆంటోని భాగ్యరాజ్ దర్శకత్వంలో టాలెంటెడ్ హీరో జయం రవి తన కొత్త సినిమాని అధికారకంగా ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకి 'సైరన్' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. తాజాగా ఇప్పుడు ఈ చిత్రం యొక్క డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సొంతం చేసుకున్నట్లు సమాచారం. మూవీ మేకర్స్ ఈ విషయాన్ని అధికారికంగా సోషల్ మీడియాలో పోస్టర్ ని విడుదల చేసి ప్రకటించారు.
ఈ తమిళ చిత్రంలో జయం రవి సరసన బబ్లీ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ రొమాన్స్ చేస్తుంది. ఈ సినిమా ఫిబ్రవరి 16, 2024న విడుదల కానుంది. ఈ సినిమాలో కీర్తి సురేష్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనుంది. ఈ చిత్రానికి జివి ప్రకాష్ కుమార్ సంగీత అందిస్తున్నారు. హోమ్ మూవీ మేకర్స్‌పై సుజాత విజయ్‌కుమార్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.