సందీప్ కిషన్ హీరోగా విఐ ఆనంద్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న మ్యాజికల్ ఫాంటసీ అడ్వెంచర్ మూవీ ‘ఊరు పేరు భైరవకోన’. కావ్య థాపర్, వర్ష బొల్లమ్మ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాను హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా లావిష్ స్కేల్లో నిర్మించారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్పై అనిల్ సుంకర సమర్పిస్తున్నారు. బాలాజీ గుత్తా ఈ చిత్రానికి సహ నిర్మాత. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ప్రమోషనల్ కంటెంట్ ప్రేక్షకులలో హ్యూజ్ బజ్‌ను క్రియేట్ చేసింది. ఫిబ్రవరి 16న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోన్న సందర్భంగా తాజాగా మేకర్స్ మీడియా సమావేశం నిర్వహించి చిత్ర విశేషాలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో హీరో సందీప్ కిషన్ మాట్లాడుతూ.. ‘ఊరు పేరు భైరవకోన’ వంటి అద్భుతమైన చిత్రాన్ని నాకు ఇచ్చిన దర్శకులు విఐ ఆనంద్‌గారికి థాంక్స్. దాదాపు రెండున్నరేళ్ళ పాటు ఈ సినిమా కోసం నిరంతరం కష్టపడ్డారు. ఆయన మొదటి సినిమా కూడా నాతోనే చేయడం గర్వంగా భావిస్తాను. అనిల్ సుంకర గారితో ఎంతో మంచి అనుబంధం వుంది. సాధారణంగా నిర్మాతగా ఆయన పేరు వేసుకోరు. కానీ నేను పట్టుపట్టి ‘నిను వీడని నీడను నేను’ సినిమాకి వేశాను. అది మాకు చాలా కలిసొచ్చింది. రాజా ‘హాస్య మూవీస్’ నా హోం బ్యానర్ లాంటిది. ఊరు పేరు భైరవకోన చాలా స్పెషల్ మూవీ. ఫాంటసీ, సూపర్ నేచురల్ ఎలిమెంట్స్ వున్న మంచి కమర్షియల్ తెలుగు సినిమా ఇది. సినిమాపై చాలా నమ్మకంగా వున్నాం. ఈ సినిమాలో పని చేసిన అందరికీ ధన్యవాదాలు. నాకు ఎప్పుడూ అండగా వుండే ప్రేక్షకులకు కృతజ్ఞతలని తెలిపారు.