బాలీవుడ్ బ్యూటీ మల్లికా షెరావత్ క్యాస్టింగ్ కౌచ్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఖ్వాహిష్ (2003), మర్డర్ (2004) వంటి సినిమాలతో ఫుల్ పాపులర్ అయ్యింది ఈ బ్యూటీ. తొలినాళ్లలో క్యాస్టింగ్ కౌచ్ కారణంగా తన కెరీర్‌పై ప్రభావం పడిందని గతంలో ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. ఓ సినిమా హీరోతో కాంప్రమైజ్ అవ్వనందుకు తనకు సినిమా ఛాన్స్ లు రాకుండా చేశారని తెలిపింది. ఆమె నటించిన ‘మర్డర్’ మూవీ విజయం సాధించడంతో షెరావత్ కు సినిమా అవకాశాలు పెరిగాయి.