నిర్మాత మరియు నటుడు జాకీ భగ్నానితో చాలా కాలం పాటు ప్రేమలో ఉన్న స్టార్ నటి రకుల్ ప్రీత్ సింగ్ ఎట్టకేలకు ఫిబ్రవరి 21న పెళ్లి చేసుకోనున్నారు. రకుల్, జాకీ ప్రీ వెడ్డింగ్ వేడుకలు ప్రారంభమయ్యాయి. వివాహానికి ముందు వేడుకలను ముంబైలో జాకీ ఇంటిలో ధోల్ రాత్రితో ప్రారంభించారు. వారి సన్నిహితులు మరియు కుటుంబ సభ్యులను ఈ వేడుకకి ఆహ్వానించారు. వేదికను సాంప్రదాయక అంశాలతో అందంగా అలంకరించారు. రకుల్, ఆమె తండ్రి మరియు సోదరుడితో కలిసి ఈవెంట్‌కి వచ్చారు. ఈ జంట ఫిబ్రవరి 21న గోవాలో వివాహం చేసుకోబోతున్నారు.