జై భీమ్ ఫేమ్ టీజే జ్ఞానవేల్ తో తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ తన తదుపరి చిత్రాన్ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. కొద్ది రోజుల క్రితం విడుదలైన ఈ సినిమా టైటిల్ టీజర్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. వేట్టైయన్ షూటింగ్ 80% పూర్తయింది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, దీపావళి సందర్భంగా వెట్టైయన్ తెరపైకి రావడానికి సిద్ధంగా ఉన్నట్లు ఫిలిం సర్కిల్ లో లేటెస్ట్ టాక్.
వేట్టైయన్ పేరుతో తెరకెక్కిన ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, ఫహద్ ఫాసిల్, రానా దగ్గుబాటి, మంజు వారియర్, దుషార విజయన్, రితికా సింగ్, GM సుందర్, రోహిణి, రావు రమేష్, రమేష్ తిలక్ మరియు రక్షణ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుభాస్కరన్ ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు.