సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ నటించిన పాన్-ఇండియా యాక్షన్ డ్రామా యానిమల్ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రం జనవరి 26, 2024న డిజిటల్ స్ట్రీమింగ్ కి అందుబాటులోకి వచ్చింది.
ఇటీవల, OTT ప్లాట్‌ఫారమ్ నెట్‌ఫ్లిక్స్‌లో అత్యధికంగా వీక్షించబడిన భారతీయ చిత్రంగా నిలిచింది. నాన్ ఇంగ్లీష్ చలనచిత్ర విభాగంలో వరుసగా రెండు వారాల పాటు ప్లాట్‌ఫారమ్ యొక్క గ్లోబల్ చార్ట్‌లలో మొదటి స్థానాన్ని కొనసాగించింది. అంతేకాకుండా, సినిమాతో పాటు విడుదలైన ఆల్బమ్ స్ఫోటిఫ్య్ లో 500 మిలియన్లకు పైగా స్ట్రీమ్‌లను నమోదు చేసి కొత్త రికార్డును నెలకొల్పింది.
ఈ సినిమాలో కన్నడ బ్యూటీ రష్మిక రణబీర్‌తో రొమాన్స్ చేయనుంది. ఈ చిత్రంలో అనిల్ కపూర్, బాబీ డియోల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని భూషణ్ కుమార్, టి-సిరీస్, భద్రకాళి పిక్చర్స్ అండ్ సినీ1 స్టూడియోస్ నిర్మిస్తున్నాయి.