కేతికాశర్మ తెలుగునాట సుపరిచితమైన పేరు. ఆమె కెరీర్లో చేసిన సినిమాలు మూడు నాలుగే అయినా ఆమె అందం, గ్లామర్‌తో యూత్‌లో మంచి ఫాలోయింగ్‌నే తెచ్చి పెట్టాయి. 2021లో ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ కుమారుడు ఆకాశ్ పూరి హీరోగా తెరకెక్కిన రొమాంటిక్ చిత్రంతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది.ఇప్పటివరకు తెలుగులో రొమాంటిక్, లక్ష్య, బ్రో, రంగరంగ వైభవంగా అనే సినిమాల్లో పేరున్న నటులకు జంటగానే చేసినప్పటికీ ప్రస్తుతం అవకాశాల విషయంలో చాలా వెనకబడింది.ఇప్పటివరకు తెలుగు తప్పా మరే భాషలోను సినిమాలు చేయని ఈ సుందరి అల్లు అర్జున్‌తో కలిసి ఆహా యాడ్లోనూ కనిపించి మెప్పించింది.అయితే చాలామంది ముంబై భామల కన్నా గ్లామర్, అందం పుష్కలంగా ఉన్న ఈ ముద్దుగుమ్మకు ఛాన్సులు రాకపోవడంపై అమె అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అవకాశాలు ఆమె తలుపు తట్టడం లేదా లేదా ఆమె కావాలని అంగీకరించడం లేదా అనే కామెంట్లు కూడా నెట్టింట చర్చకు వస్తున్నాయి.ఇవన్ని ఇలా ఉంటే ప్రస్తుతం చేతిలో ఏ సినిమా లేని ఈ ఢిల్లీ సుందరి నిత్యం ఏదోరకంగా వార్తల్లో నిలుస్తూ వస్తోంది. తరచూ హాట్ ఫోటోషూట్లతో, వీడియోలతో కుర్రాళ్ల గుండెలను బరువెక్కిస్తూ వారికి నిద్ర లేకుండా చేస్తోంది.తాజాగా ఓ బీచ్‌లో అమ్మడు తన ఫొటోలతో చేసిన రచ్చతో కుర్రకారు మతులు ఎక్కడికో పోయాయి. ఇంత అందం ఆడవికాచిన వెన్నెల అవుతుంది కదా.. టాలీవుడ్లో హీరోయిన్ల కొరత ఉందంటూ చాలా మంది పదే పదే చెబుతుంటారు. అలాంటి వాళ్లు ఈ అమ్మడికి ఛాన్సులు ఇవ్వొచ్చు కదా అంటూ ఆమె ఫాలోవర్స్ కోరుతున్నారు. ప్రప్తుతం ఈ ముద్దుగుమ్మ పడుతున్న ఈ కష్టంతోనైనా భవిష్యత్‌లో అవకాశాలు అమ్మడి తలుపులు తడతాయేమో చూడాలి.