ఊరు పేరు భైరవకోన విజయం తర్వాత టాలీవుడ్ టాలెంటెడ్ నటుడు సందీప్ కిషన్ మళ్లీ ఫార్మ్ లోకి వచ్చాడు. విఐ ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ధనుష్ నటించిన రాయన్లో సందీప్ కనిపించనున్నాడు. స్టార్ నటుడు తన తదుపరి తెలుగు సినిమాను కూడా లాక్ చేసారని త్వరలోనే అదే విషయాన్ని ప్రకటించనున్నాడని ఫిల్మ్ సర్కిల్స్ లో వార్తలు వినిపిస్తున్నాయి. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ధమాకా దర్శకుడు త్రినాథరావు నక్కిన సందీప్ కిషన్ తదుపరి చిత్రానికి దర్శకత్వం వహించనున్నట్లు సమాచారం. ఈ ప్రాజెక్ట్ కి సంబందించిన మరిన్ని వివరాలు మూవీ మేకర్స్ త్వరలో వెల్లడి చేయనున్నారు.