ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నార్త్ అమెరికాలో $350K మార్క్ ని చేరుకున్న 'గామి'

cinema |  Suryaa Desk  | Published : Sun, Mar 10, 2024, 04:22 PM

విద్యాధర్ కగిత దర్శకత్వంలో టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో విశ్వక్సేన్ నటించిన 'గామి' సినిమా మహా శివరాత్రి శుభ సందర్భంగా మార్చి 8, 2024న విడుదల అయ్యింది. ఈ సినిమా విడుదలైన అన్ని చోట్ల పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంటుంది. ఈ సినిమాని నార్త్ అమెరికాలో శ్లోక ఎంటర్టైన్మెంట్స్ విడుదల చేస్తుంది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ సినిమా నార్త్ అమెరికాలో $350K మార్క్ ని చేరుకున్నట్లు మూవీ మేకర్స్ ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు చిత్ర బృందం సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసింది.


విశ్వక్సేన్ ఈ సినిమాలో అఘోరాగా కనిపించనున్నాడు. ఈ సినిమాలో విశ్వక్సేన్ సరసన చాందిని చౌదరి జోడిగా నటిస్తుంది. MG అభినయ, మహ్మద్ సమద్, దయానంద్ రెడ్డి మరియు హారిక పెడద ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. వి సెల్యులాయిడ్ సమర్పణలో కార్తీక్ శబరీష్ ఈ చిత్రాన్ని నిర్మించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com