బాబీ కొల్లి దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ తన తదుపరి సినిమాని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి తాత్కాలికంగా ఎన్‌బికె 109 అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణ దశలో ఉంది. ఇటీవలే మూవీ మేకర్స్ ఈ సినిమా యొక్క పవర్ ఫుల్ గ్లింప్సె ని విడుదల చేసారు.
తాజాగా ఇప్పుడు ఈ చిత్రంలో కీలక పాత్రలో కనిపించనున్న ఊర్వశి రౌటేలా NBK 109ని పాన్-ఇండియన్ చిత్రంగా పేర్కొంటూ తన ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ చేసారు. ఈ ప్రకటన చాలా మందిని ముఖ్యంగా బాలకృష్ణ అభిమానులను ఆశ్చర్యపరిచింది. ఈ విషయాన్ని ధృవీకరించడానికి ప్రొడక్షన్ టీమ్ నుండి అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు బాబీ డియోల్, తెలుగు నటి చాందిని చౌదరి, దుల్కర్ సల్మాన్, ప్రముఖ డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ యాక్షన్-ప్యాక్డ్ సినిమాని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై నాగ వంశీ మరియు ఫార్చూన్ ఫోర్ సినిమా సాయి సౌజన్య నిర్మించారు. ఈ సినిమాకి సెన్సషనల్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ సంగీత అందిస్తున్నారు.