టాలీవుడ్ యంగ్ అండ్ ఎనర్జిటిక్ యాక్టర్ రామ్ పోతినేని మరియు డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ ఇస్మార్ట్ శంకర్ సినిమాకి సీక్వెల్ ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకి మూవీ మేకర్స్ 'డబుల్ ఇస్మార్ట్' అనే టైటిల్ ని లాక్ చేసి అధికారికంగా లాంచ్ చేసారు. మహా శివరాత్రికి విడుదల కావాల్సిన ఈ సినిమా షూటింగ్ ఆలస్యం కావడంతో వాయిదా పడింది.
పూరి జగన్నాధ్ తనయుడు ఆకాష్ పూరి ఈ మాస్ ఎంటర్టైనర్ గురించి కొన్ని విషయాల్ని మాట్లాడగా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రీసెంట్ గా టీజర్ చూశానని రామ్ పోతినేని ఫ్యాన్స్ కు బ్రహ్మరథం పడుతుందని ఆకాష్ పూరి అన్నారు. షూటింగ్ బాగా జరుగుతోందని విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని ఆకాష్ పూరి పేర్కొన్నాడు.
ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ నటుడు సంజయ్ దత్ ముఖ్య పాత్రలో కనిపించనున్నాడు. ఈ సినిమా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం మరియు హిందీ సినిమాల్లోని ప్రేక్షకులను ఆకట్టుకునేలా పలు భాషల్లో గ్రాండ్ గా విడుదల కానుంది. పూరి జగన్నాధ్ మరియు ఛార్మి కౌర్ కలిసి పూరీ కనెక్ట్స్‌పై, విషు రెడ్డి CEOగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.