శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి దేశానికి మూడు సార్లు ప్రధానమంత్రిగా పనిచేశారు. రాజకీయ నాయకుడిగానే కాకుండా అతను ప్రసిద్ధ కవి మరియు రచయిత. లెజెండరీ పొలిటీషియన్ బయోపిక్ మైన్ అటల్ హూన్ పేరుతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బహుముఖ నటుడు పంకజ్ త్రిపాఠి భారత మాజీ ప్రధానిగా నటించారు.
ఈ సినిమా యొక్క డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని జీ5 సొంతం చేసుకున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమా మార్చ 14న డిజిటల్ స్ట్రీమింగ్ కి అందుబాటులోకి రానున్నట్లు స్ట్రీమింగ్ ప్లాట్ఫారం అధికారకంగా ప్రకటించింది. ఈ విషయాన్ని స్ట్రీమింగ్ ప్లాట్ఫారం అధికారకంగా సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసి ప్రకటించింది.
ఈ సినిమాకి రవి జాదవ్ దర్శకత్వం వహించారు మరియు రిషి విర్మను రచించారు. పీయూష్ మిశ్రా, రాజా రమేష్‌కుమార్, దయాశంకర్ పాండే, పాయల్ నాయర్ ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. భానుశాలి స్టూడియోస్ లిమిటెడ్ మరియు లెజెండ్ స్టూడియోస్ బ్యానర్లపై వినోద్ భానుసాలి, సందీప్ సింగ్ మరియు కమలేష్ భానుశాలి ఈ చిత్రాన్ని నిర్మించారు.