బాలీవుడ్ మెగాస్టార్ సల్మాన్ ఖాన్ చివరిసారిగా టైగర్ 3లో కనిపించాడు. అయితే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఆడలేదు. ఈరోజు నటుడు తన కొత్త చిత్రాన్ని ప్రకటించాడు. గజినితో బాలీవుడ్లోకి అడుగుపెట్టిన దక్షిణ భారత దర్శకుడు AR మురుగదాస్తో నటుడు తన తదుపరి సినిమాని చేస్తున్నట్లు ప్రకటించాడు.
సల్మాన్ తన సోషల్ మీడియాలో ఈ సినిమా పట్ల తన ఉత్సాహాన్ని వ్యక్తం చేశాడు. నడియాద్వాలా గ్రాండ్సన్ ఎంటర్టైన్మెంట్పై సాజిద్ నడియాద్వాలా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారని కూడా ఆయన పేర్కొన్నారు. ఈ చిత్రం 2025 ఈద్ సందర్భంగా విడుదల కానుంది.