మంచు మనోజ్ సతీమణి మౌనిక కవలలకు జన్మనిచ్చిందని ఇటీవల చాలా యూట్యూబ్ ఛానెల్స్ కథనాలు సృష్టించాయి.అవి వైరల్‌గా మారడంతో వాటిపై క్లారిటీ ఇచ్చేందుకు మనోజ్ ఎక్స్ ప్లాట్‌ఫారమ్‌లో స్పందించారు. ‘‘మీరు మాపై చూపిస్తున్న ప్రేమకు హృదయపూర్వక కృతజ్ఞతలు. నా సతీమణి ఏడో నెల గర్భవతి. ఇంకొన్ని రోజుల్లో మా జీవితాల్లోకి రానున్న బిడ్డల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం. సమయం వచ్చినప్పుడు మేమే ఆనందాన్ని మీతో స్వయంగా పంచుకుంటాం’’ అని తెలిపారు.