బాలీవుడ్ ఇండస్ట్రీ లో అదిరిపోయే రేంజ్ క్రేజ్ ఉన్న నటీ మణులలో అనుష్క శర్మ ఒకరు. ఈమె తన కెరియర్ లో ఎన్నో అద్భుతమైన విజయవంతమైన సినిమాలలో నటించి ఇండియా వ్యాప్తంగా సూపర్ క్రేజ్ ను సంపాదించుకుంది.ఇకపోతే అదిరిపోయే రేంజ్ ఉన్న సినిమాలలో అవకాశాలు దక్కుతున్న సమయం లోనే అనుష్క శర్మ ప్రముఖ భారత క్రికెటర్ విరాట్ కోహ్లీ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. వివాహం తర్వాత కూడా అనుష్క శర్మ సినిమాలలో నటిస్తూ తన కెరీర్ ను ఫుల్ జోష్ లో ముందుకు సాగిస్తుంది.ఇక ప్రస్తుతం అనుష్క శర్మ వరుస సినిమలలో నటిస్తూ కెరియర్ ను బిజీగా గడపడం మాత్రమే కాకుండా తన ఫ్యామిలీ తో కూడా వీలైనంత సమయాన్ని గడుపుతూ అటు తన వృత్తిక్పరంగానూ ... ఇటు ఫ్యామిలీ పరం గాను రెండిటికి న్యాయం చేస్తూ ఒక ఉత్తమ మహిళ గా ముందుకు దూసుకుపోతుంది. ఇది ఇలా ఉంటే ఇప్పటి వరకు అనుష్క ఎన్నో సినిమాలలో తన అద్భుతమైన , నటనతో ప్రేక్షకులను అలరించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. అలాగే కొన్ని సినిమాలను తన నటనతో విజయం వైపు తీసుకు వెళ్లిన సందర్భాలు కూడా ఉన్నాయి.
ఇకపోతే ఇంతటి క్రేజ్ మరియు టాలెంట్ ఉన్న ఈ బ్యూటీ ఒక్కో మూవీ కి భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. అనుష్క శర్మ ఒక్కో మూవీ కి 8 నుండి 12 కోట్ల వరకు రెమ్యూనిరేషన్ తీసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇకపోతే ఈమెకి కనుక సినిమా కథ నచ్చిన ... అందులో తన పాత్ర బాగా నచ్చిన ... అలాగే దర్శకులను , ఆ సినిమా నిర్మాతలను బట్టి కూడా ఈమె తమ రెమ్యూనిరేషన్ భారీ మొత్తంలో కూడా తగ్గించుకున్న కొన్ని సందర్భాలలో ఉన్నట్లు తెలుస్తోంది.