తెలుగు ప్రేక్షకకులకు పరిచయం అక్కర్లేని నటి ప్రణీత సుభాష్. పేరుకు కన్నడ నటి అయినా ఆమెకు తెలుగు చిత్రాలతోనే మంచి గుర్తింపు లభించింది. తనీష్ హీరోగా వచ్చిన ఏం పిల్లో.. ఏం పిల్లడోతో 2010 తెలుగులోకి ఆరంగేట్రం చేసిన ఈ ముద్దుగుమ్మ ఇక్కడ చేసింది తక్కువ సినిమాలే.అయినా.. సిద్ధార్థ్‌తో చేసిన బావ, పవన్ కల్యాణ్‌తో అత్తారింటికి దారేది, ఎన్టీఆర్‌తో రభస, మహేశ్ బాబుతో బ్రహ్మోత్సవం వంటి సినిమాలలో నటించి ఇక్కడ యూత్‌లో అభిమానులను బాగానే సంపాదించింది.ఇదిలాఉండగా.. 2019 కరోనా అనంతరం సినిమా ఛాన్సులు తగ్గడంతో అడపాదడపా మాత్రమే చిత్రాల్లో కనిపిస్తూ వస్తుంది.దాదాపు మూడేండ్ల గ్యాప్ తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు మలయాళంలోకి ఎంట్రీ ఇస్తూ దిలీప్ వంటి అగ్ర హీరోతో థంకమణి అనే ఓ క్రైమ్ థ్రిల్లర్ సినిమా చేసిన ప్రణీత అందులో నటనకు ఆస్కారమున్న IPS పాత్రలో నటించడం విశేషం. ప్రస్తుతం ఓ కన్నడ సినిమా మాత్రమే చేతిలో ఉంది. 2021లో నితిన్ రాజు అనే ఓ బిజినెస్‌మెన్‌ను పెళ్లి చేసుకున్న ప్రణీత 2022లో ఓ పాపకు కూడా జన్మనిచ్చింది.అయితే పెళ్లికి ముందు నటించిన చాలా చిత్రాలలో గ్లామర్ ప్రదర్శనకు దూరంగా ఉన్న ఈ కన్నడ కస్తూరి ఇప్పుడు అందుకు భిన్నంగా రోజుకోరకమైన కలర్‌ఫుల్ ఫొటోషూట్లతో సోషల్ మీడియాలో కాక రాజేస్తోంది.కర్నాటకలో చాలా షాపింగ్ మాల్‌లకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న ప్రణీత వాటి ప్రమోషన్ల నిమిత్తం తరుచూ కురచ దుస్తులను ధరిస్తూ.. పెళ్లైనా ఎక్కడ తగ్గేది లే అన్నట్లుగా అందాల విందు చేస్తోంది. తన ఫొటోషూట్లతో అభిమానులను, సినీ ప్రేక్షకులను కనులవిందు గావిస్తున్నది.