కేంద్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. దేశంలో ప్రముఖంగా చలామణిలో ఉన్న దాదాపు 18 ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లను, సోషల్ మీడియాలను నిషేదిస్తూ వాటిపై చర్యలు తీసుకోవాలని తాజాగా ఆదేశాలు జారీ చేసింది. ఈమేరకు కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ మీడియా సమావేశంలో వివరాలు వెళ్లడించారు. అయితే గతంలోనే అశ్లీల వైబ్‌సైట్లను బ్యాన్ చేసిన ప్రభుత్వం తాజాగా ఈ నిర్ణయంతో ఆ పరిశ్రమపై భారీ దెబ్బే తగలనుంది. దీంతో ఉన్నఫలంగా Uncut Adda, Prime Play, Nuefliks, X Prime, Dream Films, Neon X VIP, MoodX, Tri Flicks, Xtramood, Chikooflix, Hot Shots VIP, Mojflix, Besharams, Voov, Fugi, Rabbit, Yessma, Hunters వంటి 18 ఓటీటీ సంస్థలతో పాటు వీటికి లింకై ఉన్న 19 వెబ్సైట్లు, 10 యాప్‌లు, 57 సోషల్ మీడియా అకౌంట్లను కూడా బ్లాక్‌లిస్టులో చేర్చుతూ కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఈ రోజు (గురువారం) నిర్ణయం తీసుకుంది. అంతేగాక అవి బయట కనిపించకుండా రిస్ట్రిక్ట్ చేసింది.