యానిమల్ సినిమా విడుదల తర్వాత త్రిప్తి డిమ్రీ సంచలనంగా మారింది. త్రిప్తి ప్రస్తుతం భూల్ భూలయ్యా మరియు ఆషికి 3 వంటి కొన్ని పెద్ద ప్రాజెక్ట్‌లను చేజిక్కించుకుంది. ఆమె ఇప్పటికే ఈ సినిమాల షూటింగ్ ప్రారంభించింది.
తాజాగా ఇప్పుడు, సందీప్ రెడ్డి వంగా యొక్క యానిమల్‌లో ఆమె అతిథి పాత్ర కోసం 40 లక్షలు రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు సమాచారం. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, అనీజ్ బాజ్మీ దర్శకత్వం వహిస్తున్న కార్తీక్ ఆర్యన్ యొక్క భూల్ భూలైయా 3 లో చిన్న పాత్ర కోసం త్రిప్తి కోటి రూపాయల పారితోషికం తీసుకుంటున్నట్లు ఫిలిం సర్కిల్ లో లేటెస్ట్ టాక్.