సాయి మోహన్ ఉబ్బన దర్శకత్వంలో పలాస 1978కి చెందిన రక్షిత్ అట్లూరి ఒక ప్రాజెక్ట్ ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి మూవీ మేకర్స్ 'శశివదనే' అనే టైటిల్ ని లాక్ చేసారు. ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ లో రక్షిత్ అట్లూరికి జోడిగా కోమలీ ప్రసాద్ నటిస్తుంది.
తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా ఏప్రిల్ 19, 2024న విడుదల కానున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు చిత్ర బృందం సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదలా చేసింది. ఈ సినిమాలో ప్రవీణ్ యెండమూరి, శ్రీమన్, దీపక్ ప్రిన్స్, జబర్దస్త్ బాబీ కీలక పాత్రలు పోషించారు.
గౌరీ నాయుడు సమర్పణలో అహితేజ బెల్లంకొండ SVS కన్స్ట్రక్షన్స్ ప్రై.లి. లిమిటెడ్ మరియు AG ఫిల్మ్ కంపెనీతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శరవణ వాసుదేవన్ మరియు అనుదీప్ దేవ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.