క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో అనుష్క శెట్టి తన కొత్త ప్రాజెక్ట్ ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి మూవీ మేకర్స్ 'ఘాటీ' అనే టైటిల్ ని లాక్ చేసారు. ముంబైలో జరిగిన అమెజాన్ ప్రైమ్ ఈవెంట్లో ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ని విడుదల చేశారు. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.
లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ సినిమా ప్రీ-రిలీజ్ బిజినెస్ 20 కోట్లకు లాక్ అయ్యినట్లు ఫిలిం సర్కిల్ లో వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఒడిశాలో చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రంలో అనుష్క శెట్టి సరసన తమిళ నటుడు విక్రమ్ ప్రభు నటించనున్నట్టు సమాచారం. ప్రొడక్షన్ హౌస్ UV క్రియేషన్స్ ఈ ప్రాజెక్ట్‌కు భారీ స్థాయిలో నిర్మిస్తుంది.