టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ దర్శకుడు అనిల్ రావిపూడితో కలిసి పూర్తి వినోదాత్మక చిత్రం కోసం జతకట్టనున్నారు. ఈ సినిమా ఎంటర్టైన్మెంట్ జోన్ లో రానున్నట్లు సమాచారం. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ సినిమా షూటింగ్ మే లేదా జూన్ లో ప్రారంభం కానున్నట్లు ఫిలిం సర్కిల్ లో వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ సినిమాలో వెంకటేష్ కి జోడిగా త్రిష నటిస్తున్నట్లు లేటెస్ట్ టాక్. ఈ చిత్రానికి "సంక్రాంతికి వస్తున్నాం" అనే టైటిల్ ని మూవీ మేకర్స్ రిజిస్టర్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రం గ్రామీణ నేపథ్యంలో సాగే ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఉంటుందని సమాచారం. అగ్ర నిర్మాత దిల్ రాజు ఈ ప్రాజెక్ట్‌ని నిర్మించనున్నారు.