అశోక్ సెల్వన్ నటించిన 'పొన్ ఒండ్రు కండేన్' చిత్రం చాలా కాలంగా నిర్మాణంలో ఉంది. కొద్దిరోజుల క్రితమే ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేయకుండా నేరుగా బుల్లితెరపై ప్రసారం చేయనున్నట్టు ప్రకటించారు. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ చిత్రం డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ అవుతుంది. పొన్ ఒండ్రు కండెన్ ఏప్రిల్ 14న జియో సినిమాలో స్ట్రీమింగ్ కోసం అందుబాటులో ఉంటుంది అని సమాచారం.
ఈ సినిమాలో ఐశ్వర్య లక్ష్మి కథానాయికగా నటించింది. యువన్ శంకర్ రాజా సంగీతం అందించిన ఈ ప్రాజెక్ట్‌కి లేడీ డైరెక్టర్ ప్రియా.వి.కామాక్షి దర్శకత్వం వహించారు. జియో స్టూడియోస్ ఈ చిత్రాన్ని నిర్మించింది.