బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ మరియు సౌత్ స్టార్స్ జ్యోతిక మరియు మాధవన్ నటించిన 'షైతాన్' మార్చి 8, 2024న విడుదల అయ్యింది. షైతాన్ సినిమా సూపర్ హిట్ గుజరాతీ హారర్ థ్రిల్లర్ వాష్ యొక్క అధికారిక రీమేక్. హారర్ థ్రిల్లర్ ట్రాక్ లో వచ్చిన ఈ సినిమా భారతదేశంలో దాదాపు 130 కోట్ల గ్రాస్ ని రాబట్టింది. రన్ ముగిసే సమయానికి, షైతాన్ ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద 200 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేస్తుందని అంచనా వేస్తున్నారు.
ఈ చిత్రానికి వికాస్ బహ్ల్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో అజయ్ దేవగన్ పైలట్‌గా నటించగా, అజయ్ భార్యగా జ్యోతిక కనిపించనుంది. జియో స్టూడియోస్, దేవగన్ ఫిల్మ్స్ మరియు పనోరమా స్టూడియోస్ బ్యానర్‌లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ చిత్రానికి అమిత్ త్రివేది సంగీతం అందిస్తున్నారు.