వినాయక్ వైద్యనాథన్ దర్శకత్వంలో విజయ్ ఆంటోనీ ఒక చిత్రానికి ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకి మూవీ మేకర్స్ రోమియో అనే టైటిల్ ని లాక్ చేసారు. ఈ చిత్రం తెలుగు వెర్షన్ లవ్ గురు అనే టైటిల్ తో విడుదల కానుంది. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా ట్రైలర్ ని విడుదల చేసారు. ఈ సినిమాలో మృణాళిని రవి కథానాయికగా నటిస్తోంది. మీరా విజయ్ ఆంటోనితో కలిసి విజయ్ ఆంటోని తన బ్యానర్ విజయ్ ఆంటోని ఫిల్మ్ కార్పొరేషన్‌పై ఈ సినిమాని నిర్మించారు.