తమిళ నటుడు జయం రవి తన 32వ చిత్రం జెనీ పేరుతో అధికారికంగా ప్రారంభించారు. ఈ చిత్రం నటుడి కెరీర్‌లో అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతున్న చిత్రం మరియు భువనేష్ అర్జునన్ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా నుండి జయం రవి సెకండ్ లుక్ పోస్టర్ ని విడుదల చేసారు.
ప్రముఖ నిర్మాణ సంస్థ వేల్స్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తోంది. ఈ సినిమాలో జయంరవి సరసన కళ్యాణి ప్రియదర్శన్, కృతి శెట్టి మరియు వామికా గబ్బి నటిస్తున్నట్లు సమాచారం. ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ సంగీతం అందించనున్న ఈ చిత్రం తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది.