సంతోష్ కంభంపాటి రచన మరియు దర్శకత్వంలో చైతన్య రావు ఒక ప్రాజెక్ట్ ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. క్రైమ్ కామెడీ ట్రాక్ లో రానున్న ఈ సినిమాకి మూవీ మేకర్స్ 'పారిజాత పర్వం' అనే టైటిల్ ని లాక్ చేసారు. ఈ సినిమా కాన్సెప్ట్ టీజర్ ఈ సినిమాపై భారీ బజ్ ని క్రియేట్ చేసింది. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా నుండి సునీల్ ఇంట్రడక్షన్ వీడియోని విడుదల చేసారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసారు.
ఈ సినిమాలో ప్రముఖ నటి శ్రద్ధాదాస్ కీలక పాత్రలో కనిపించనుంది. ఈ సినిమాలో యువ హాస్యనటుడు వైవా హర్ష, మాళవిక సతీశన్, సునీల్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాని వనమాలి క్రియేషన్స్ బ్యానర్‌పై మహీధర్ రెడ్డి మరియు దేవేష్ నిర్మిస్తున్నారు. అనంత సాయి ఈ చిత్రానికి సహ నిర్మాతగా ఉన్నారు.