అల్ట్రా-మాస్ యాక్షన్ డ్రామా యానిమల్‌తో ప్రేక్షకులను అలరించిన తరువాత రణబీర్ కపూర్ తన తదుపరి సినిమాని దంగల్ ఫేమ్ నితేష్ తివారీతో చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే. భారతీయ ఇతిహాసం రామాయణం ఆధారంగా రానున్న ఈ సినిమాలో రణబీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా, శాండల్‌వుడ్ స్టార్ యష్ రావణుడిగా నటిస్తున్నారు.
ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటుంది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఏప్రిల్ 17న శ్రీరామ నవమి రోజున ఈ ప్రాజెక్ట్ అధికారిక ప్రకటన వెలువడనుంది అని ఫిలిం సర్కిల్ లో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్ కి సంబందించిన మరిన్ని వివరాలని మూవీ మేకర్స్ త్వరలో వెల్లడి చేయనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa