కోలీవుడ్ సూపర్ స్టార్ అజిత్ తన 62వ ప్రాజెక్ట్ ని యువ తమిళ దర్శకుడు మగిజ్ తిరుమేనితో చేస్తున్నట్లు అధికారకంగా ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి 'విదా ముయార్చి' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. అజిత్ కుమార్ రిస్కీ స్టంట్స్ చేయడంలో పేరుగాంచాడు. ఈ సినిమా కోసం నటుడు అజర్బైజాన్లో ప్రమాదకర కార్ స్టంట్ చేశాడు. ఈ సాహసోపేతమైన విన్యాసాన్ని చూసి అభిమానులు, నెటిజన్లు షాక్ అవుతున్నారు. అజిత్ డెడికేషన్ లెవెల్స్‌కి చప్పట్లు కొడుతున్నారు. అదే సమయంలో ఇలాంటి రిస్క్ స్టంట్స్ చేయవద్దని నటుడిని కోరుతున్నారు.
ఈ సినిమాలో అజిత్ కి జోడిగా తమిళ స్టార్ నటి త్రిష జోడిగా కనిపిస్తుంది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌లో రెజీనా కసాండ్రా, అర్జున్ సర్జా మరియు ఆరవ్ కూడా ఒక కీలక అపాత్రలో కనిపించనున్నారు. అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ బిగ్గీలో హిందీ నటుడు సంజయ్ దత్ కూడా ఒక ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నారు. కోలీవుడ్ హిట్ మెషిన్ అనిరుధ్ రవిచందర్ ఈ హై బడ్జెట్ ఎంటర్టైనర్కు సంగీతం అందిస్తున్నారు. అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ ప్రాజెక్ట్‌ని లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది.