దక్షిణ కొరియా పాప్ సింగర్ పార్క్ బో రామ్ (30) హఠాన్మరణం చెందారు. గురువారం అర్థరాత్రి ఆమె తన ఫ్రెండ్స్‌తో ఓ పార్టీకి వెళ్లి మద్యం తాగారు. ఆ తర్వాత రెస్ట్ రూమ్‌కి వెళ్లి అక్కడే అపస్మారక స్థితికి చేరుకున్నారు. హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా పార్క్ అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు.పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఆమె మరణవార్త విన్న అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa