తెలుగు సినిమా 'సిద్దు ఫ్రమ్ శ్రీకాకుళం' ద్వారా చిత్ర పరిశ్రమలోకి ఆరంగేట్రం చేసిన శ్రద్ధ దాస్ ఆ తరువాత ఒక్క తెలుగులోనే కాకుండా అటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడ సినిమాలలో కూడా నటించింది. కానీ పేరు ఎక్కువగా తెచ్చుకున్నది మాత్రం ఒక్క తెలుగులోనే. సుకుమార్ దర్శకత్వం వచించిన 'ఆర్య 2' లో అల్లు అర్జున్ కథానాయకుడు, కాజల్ అగర్వాల్ కథానాయిక. అందులో నవదీప్ ఇంకో ముఖ్యమైన పాత్ర పోషిస్తే, శ్రద్ధ దాస్ కూడా ఒక ముఖ్య పాత్రలో కనపడింది. ఈ సినిమా శ్రద్ధ కి మంచి పేరు తెచ్చిపెట్టింది. కానీ శ్రద్ధ దాస్ కి ఎందుకో ఆ తరువాత ఎక్కువగా తెలుగులో మంచి సినిమాలు రాలేదు.ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో వచ్చిన 'గుంటూరు టాకీస్' సినిమాలో శ్రద్ధ దాస్ ఒక ముఖ్యమైన పాత్ర పోషించింది. సిద్ధు జొన్నలగడ్డ, రష్మీ గౌతమ్ ఇందులో ప్రధాన జంటగా నటిస్తే, శ్రద్ధ దాస్ ఒక లేడీ డాన్ గా కనపడి మంచి ప్రశంశలు అందుకుంది. అదే ప్రవీణ్ సత్తారు తరువాత తన సినిమా 'పీఎస్వీ గరుడ వేగ' సినిమాలో శ్రద్ధ దాస్ కి ఒక మంచి పాత్ర ఇచ్చారు. 2021లో 'ఏక్ మినీ కథ' అనే సినిమా ఓటిటి లో ప్రసారం అయింది. ఈ సినిమాలో సంతోష్ శోభన్, కావ్య థాపర్ జంటగా నటించారు. ఈ సినిమాలో శ్రద్ధ దాస్ జూనియర్ గురూజీ అనే పాత్ర చేసింది. ఈ పాత్రకి ఆమెకి మంచి పేరు వచ్చింది.మళ్ళీ ఇప్పుడు చాలా కాలం తరువాత శ్రద్ధ దాస్ 'పారిజాత పర్వం' అనే సినిమాలో ఒక ప్రధాన పాత్రలో కనిపించనుంది. సంతోష్ కంభంపాటి ఈ సినిమాకి దర్శకుడు. వచ్చే వారం విడుదలవుతోంది. ఇందులో శ్రద్ధ మూడు విభిన్న రూపాల్లో కనపడనుంది అని చెప్పింది.ఈ సినిమా ఒక ఉగాది పచ్చడిలా ఉంటుంది అని చెప్పింది శ్రద్ధ ఎందుకుంట ఉగాది పచ్చడిలో అన్ని రుచులు ఎలా మిశ్రమం అయి వుంటాయో, ఈ సినిమాలో అన్ని రకాల ఎలెమెంట్స్ ఉంటాయి అని చెప్తోంది. 'పారిజాత పర్వం' ఒక కిడ్నాప్ డ్రామా అని, ఇది వినోదాత్మకంగా వుండి అందరినీ అలరిస్తుందని చెప్పింది శ్రద్ధ దాస్.