రమేష్ కడూరి దర్శకత్వంలో టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన 'మీటర్' సినిమా వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ మే 6, 2024న రాత్రి 9 గంటలకు జెమినీ మూవీస్ ఛానల్ లో ప్రదర్శించబడుతుందని సమాచారం. ఈ అవుట్-అండ్-అవుట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ లో కోలీవుడ్ బ్యూటీ అతుల్య రవి కథానాయికగా నటిస్తోంది.
ఈ చిత్రంలో పవన్, పోసాని కృష్ణమురళి, సప్తగిరి తదితరులు కీలక పాత్రలు పోషించారు. సాయి కార్తీక్ ఈ సినిమాకి సంగీతం అందించారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్, చిరంజీవి (చెర్రీ) క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో కలిసి ఈ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తుంది.