టాలీవుడ్ నటుడు శర్వానంద్ తన 37వ ప్రాజెక్ట్ ని సమాజవరగమన దర్శకుడు రామ్ అబ్బరాజుతో చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి మూవీ మేకర్స్ తాత్కాలికంగా శర్వా37 అని పేరు పెట్టారు. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ సినిమా యొక్క షూటింగ్ హైదరాబాద్ లోని ఖానాపూర్ లో జరుగుతున్నట్లు సమాచారం.
ఎకె ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై అనిల్ సుంకర ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ కి సంబందించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.