శ్రీకాంత్ సినిమా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త శ్రీకాంత్ బొల్లా జీవితం ఆధారంగా రాబోయే హిందీ భాషా జీవిత చరిత్ర. శ్రీకాంత్ బొల్లా పుట్టుకతోనే దృష్టిలోపం ఉన్నవాడు మరియు బొల్లాంట్ ఇండస్ట్రీస్ వ్యవస్థాపక చైర్మన్ అయ్యాడు. ఈ సినిమా విడుదలైన తొలిరోజు దాదాపు 2.4 కోట్ల వసూళ్లు రాబట్టినట్లు సమాచారం. ఈ చిత్రం రెండో రోజు అద్బుతమైన వసూళ్లను నమోదు చేసింది. ఓపెనింగ్ డేతో పోలిస్తే శ్రీకాంత్ 90% అప్‌వర్డ్ ట్రెండ్ చూపించి 4.26 కోట్ల నెట్ వసూళ్లు చేసింది. మూడవ రోజు, ఈ చిత్రం దాదాపు 5.7 కోట్ల నెట్‌ను రాబట్టి మొదటి వారాంతంలో మొత్తం 12 కోట్లకు చేరుకుంది.
అద్భుతమైన పెర్ఫార్మర్ రాజ్ కుమార్ రావు ఈ సినిమా టైటిల్ రోల్ పోషించారు. జ్యోతిక, అలయ ఎఫ్, శరద్ కేల్కర్ ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. ప్రముఖ రచయిత తుషార్ హీరానందాని ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa