జూబ్లీహిల్స్‌లోని ఒక ఆస్తి వివాదంలో టాలీవుడ్ స్టార్ నటుడు జూనియర్ ఎన్టీఆర్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించినట్లు ఈరోజు ఉదయం నుంచి వార్తలు వస్తున్నాయి. కొన్ని నివేదికల ప్రకారం, ఎన్టీఆర్ 2003లో సుంకు గీతా లక్ష్మి నుండి జూబ్లీహిల్స్‌లో 681 చదరపు గజాల ప్లాట్‌ని కొనుగోలు చేశారు. సదరు మహిళ నకిలీ పత్రాలు సృష్టించి, వివిధ బ్యాంకుల్లో రుణాలు పొందేందుకు ప్లాట్‌ను తనఖా పెట్టినట్లు సమాచారం.
డెట్ రికవరీ ట్రిబ్యునల్ (డిఆర్‌టి) నుండి బ్యాంకులకు అనుకూలంగా ఆర్డర్ రావడంతో, వారు ఆస్తిని స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించారు. ఈ కారణంగా స్టార్ నటుడు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు అని నివేదికలు పేర్కొన్నాయి. అభిమానులు సోషల్ మీడియాలో దీని గురించి చర్చించుకోవడం ప్రారంభించగా, స్టార్ నటుడి టీమ్ ఈ విషయాన్ని క్లియర్ చేస్తూ పత్రికా ప్రకటన విడుదల చేసింది. వర్క్ ఫ్రంట్ లో చూస్తే, ఎన్టీఆర్ తదుపరి చిత్రం కొరటాల శివ దర్శకత్వంలో దేవరలో కనిపించనున్నాడు.