ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆహాలో డిజిటల్ ఎంట్రీ ఇచ్చేసిన 'యాత్ర 2'

cinema |  Suryaa Desk  | Published : Tue, Jun 04, 2024, 08:55 AM

ఆంధ్ర ప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన యాత్ర సినిమా 2019లో విడుదలై సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాకి సీక్వెల్ అయ్యిన 'యాత్ర 2' సినిమాకి మహి వి రాఘవ్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా డిజిటల్ రైట్స్ ని ఆహా సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఇప్పుడు ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ కి అందుబాటులోకి వచ్చింది. ఈ విషయాన్ని స్ట్రీమింగ్ ప్లాట్ఫారం అధికారికంగా సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసి ప్రకటించారు. దివంగత రాజకీయ నాయకుడు వైఎస్ఆర్ తనయుడు వైఎస్ జగన్ పాత్రలో స్టార్ హీరో జీవా నటిస్తున్నారు. ఈ చిత్రంలో నారా చంద్రబాబు నాయుడుగా మహేష్ మంజ్రేకర్, సోనియాగాంధీగా సుజానే బెర్నార్డ్, వైఎస్ భారతిగా కేతకి నారాయణన్ నటిస్తున్నారు. నిర్మాణ సంస్థలు V సెల్యులాయిడ్ మరియు త్రీ ఆటం లీవ్స్ ఈ గ్రిప్పింగ్ పొలిటికల్ థ్రిల్లర్ ని నిర్మిస్తున్నాయి. సంతోష్ నారాయణన్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa