శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో టాలీవుడ్ నటుడు శర్వానంద్ ఒక కొత్త ప్రాజెక్ట్ ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి మూవీ మేకర్స్ 'మనమే' అనే టైటిల్ ని ఖరారు చేసారు. ఈ సినిమా జూన్ 7, 2024న విడుదలకి సిద్ధంగా ఉంది. జూన్ 5, 2024న హైదరాబాద్‌లోని ఎన్ కన్వెన్షన్‌లో ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ జరగనుందని సమాచారం. తాజాగా ఇప్పుడు, మాస్ మహారాజా రవితేజ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరవుతారని లేటెస్ట్ టాక్. త్వరలో మూవీ టీమ్ నుంచి అధికారిక ప్రకటన రానుంది. ఈ చిత్రంలో శర్వాకి జోడిగా కృతి శెట్టి నటిస్తుంది. విలక్షణమైన కథాంశంతో వస్తున్న ఈ సినిమాని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టిజి విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. హేషమ్ అబ్దుల్ వహాబ్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa