ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'సత్యభామ' పై లేటెస్ట్ బజ్

cinema |  Suryaa Desk  | Published : Tue, Jun 04, 2024, 11:40 AM

సుమన్ దర్శకత్వంలో స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఒక ప్రాజెక్ట్ ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. క్రైమ్ థ్రిల్లర్ ట్రాక్ లో రానున్న ఈ చిత్రానికి 'సత్యభామ' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. ఈ సినిమాలో కాజల్‌ అగర్వాల్‌ పవర్‌ఫుల్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా నటిస్తోంది. ఈ సినిమా జూన్ 7న విడుదల కానుంది. తాజాగా ఇప్పుడు ఈ సినిమా చివరి అరగంట థ్రిల్లింగ్‌గా సాగుతుందని సమాచారం. ప్రధాన ట్విస్ట్ రివీల్ చేయబడిన ప్రీ-క్లైమాక్స్ నుండి సత్యభామ ప్రేక్షకులను కట్టిపడేస్తుందని వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రంలో నవీన్ చంద్ర కీలక పాత్రలో నటిస్తున్నారు. మేజర్ మరియు గూఢచారి ఫేమ్ శశి కిరణ్ తిక్క ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఔరుమ్ ఆర్ట్స్ బ్యానర్‌పై బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపెల్లి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీ చరణ్ పాకాల ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa