సమాజవరగమన ఘనవిజయం తర్వాత నటుడు శ్రీవిష్ణు రాజా రాజా చోరాకు దర్శకత్వం వహించిన హసిత్ గోలితో తన తదుపరి ప్రాజెక్ట్ ని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం రాజా రాజా చోరాకు ప్రీక్వెల్‌గా వస్తున్నట్లు సమాచారం. ఈ కామెడీ ఫాంటసీ డ్రామాకి 'స్వాగ్' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, విష్ణు ఈ చిత్రంలో 14 విభిన్న గెటప్‌లలో కనిపించనున్నట్లు అందులో ఒకటి ట్రాన్స్‌జెండర్ పాత్ర అని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీనికి సంబంధించి ఇంకా ఎలాంటి అధికారిక ధృవీకరణ వెలువడలేదు. మీరా జాస్మిన్ ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తుందని ఇటీవల చిత్రనిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాలో రీతూ వర్మ కథానాయికగా నటిస్తుంది. తాజాగా చిత్ర బృందం ఈ సినిమాకి సంబందించిన అప్డేట్ ని రేపు ఉదయం 10 గంటలకి విడుదల చేయనున్నట్లు ఆన్లైన్లో స్పెషల్ పోస్టర్ ని విడుదల చేసి ప్రకటించారు. ఈ చిత్రంలో శ్రీవిష్ణు నాలుగు విభిన్నమైన అవతారాలలో కనిపించనున్నట్లు లేటెస్ట్ బజ్. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమాని నిర్మిస్తుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa