ట్రెండింగ్
Epaper    English    தமிழ்

త్వరలో 'గేమ్ ఛేంజర్' సెట్స్‌పైకి రానున్న రామ్ చరణ్

cinema |  Suryaa Desk  | Published : Tue, Jun 04, 2024, 05:15 PM

సెన్సషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన 15వ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి 'గేమ్ ఛేంజ'ర్ అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కైరా అద్వానీ కథానాయికగా నటిస్తోంది. తాజా నివేదికల ప్రకారం, చరణ్ ఈ వారం రాజమండ్రిలో గేమ్ ఛేంజర్ షూటింగ్‌ను తిరిగి ప్రారంభించనున్నారు. ఈ షెడ్యూల్ వారం రోజుల పాటు సాగుతుందని లేటెస్ట్ టాక్. రాజమండ్రిలో ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన భాగాలను చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమాలో రామ్ చరణ్ ద్విపాత్రాభినయంలో కనిపించనున్నాడు. అరవింద్ స్వామి, ఎస్‌జే సూర్య, సురేష్ గోపి, ఈషా గుప్తా, అంజలి, శ్రీకాంత్, జయరామ్, సునీల్, హ్యారీ జోష్ మరియు నవీన్ చంద్ర ఈ సినిమాలో కీలక పాత్రలలో కనిపించనున్నారు. ఈ మెగా చిత్రానికి థమన్ ఎస్ సౌండ్‌ట్రాక్స్ అందించనున్నారు. దిల్ రాజు తన హోమ్ బ్యానర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌పై ఈ సినిమాని నిర్మిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa