క్రిష్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ "హరి హర వీర మల్లు" సినిమా చేస్తున్న సంగతి అందరికి తెలిసందే. ఈ సినిమా టీజర్ స్వోర్డ్ VS స్పిరిట్ సినిమాపై భారీ బజ్ ని క్రియేట్ చేసింది. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా నుండి పవన్ కళ్యాణ్ యొక్క స్పెషల్ పోస్టర్ ని విడుదల చేసారు. ఈ చిత్రంలో నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమాలో బాబీ డియోల్, అర్జున్ రాంపాల్, సిజ్లింగ్ బ్యూటీ నోరా ఫతేహి ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. ఈ పాన్-ఇండియా మూవీని మెగా సూర్య ప్రొడక్షన్ నిర్మిస్తుండగా, ఎంఎం కీరవాణి సంగీతం అందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa